ఓ స్నేహమా నిన్ను చూడలేక మనసు రాస్తున్నది మదన లేఖ ఓ నేస్తమా అని పిలవలేక సాగుతున్నా నువ్వు లేక కనుల ముందు నువ్వు కదలాడక కలలోనే ఇక మన కలయిక మనసు విప్పి మాట్లాడక మనసులోనే చిరు మాటలిక కలిసి గడిపిన మధుర క్షణాలు కాలం ఇచ్చిన గొప్ప వరాలు గుర్తుకొస్తే మన చిలిపి మాటలు చిగురిస్తాయి చిరునవ్వులు అంతులేనిది మన స్నేహం అందమైనది గడిపిన కాలం నువ్వు నేర్పిన జీవన వేదం ఆచరిస్తా నేను కలకాలం
సంపూర్ణత మనిషికి సంతోషం మనసుకి