Skip to main content

Posts

Showing posts from 2018

వీడ్కోలు నేస్తం

ఓ స్నేహమా నిన్ను చూడలేక  మనసు రాస్తున్నది మదన లేఖ  ఓ నేస్తమా అని పిలవలేక సాగుతున్నా నువ్వు లేక  కనుల ముందు నువ్వు కదలాడక  కలలోనే ఇక మన కలయిక  మనసు విప్పి మాట్లాడక  మనసులోనే చిరు మాటలిక  కలిసి గడిపిన మధుర క్షణాలు  కాలం ఇచ్చిన గొప్ప వరాలు  గుర్తుకొస్తే మన చిలిపి మాటలు  చిగురిస్తాయి చిరునవ్వులు  అంతులేనిది మన స్నేహం  అందమైనది గడిపిన కాలం  నువ్వు నేర్పిన జీవన  వేదం  ఆచరిస్తా నేను కలకాలం 

కొత్త ప్రయాణం

కలలు కంటు  కదలనంటు  కడతేరని కథలు చెబుతు కూర్చున్నా నేను ఒక మట్టి బొమ్మలా  గమనమేది  గమ్యమేది  గతి మార్చే మంత్రమేది  గడిచేనా ఇలా నా ప్రతి కల  కనులు తెరిచి  ఒళ్ళు విరిచి  గతమంతా క్షణము మరిచి  పొరబాటున చూసానొక కొత్త ప్రపంచం  రంగులతో  హంగులతో  అలుపెరుగని కన్నులతో  చేస్తున్నా నేను ఒక కొత్త ప్రయాణం  ఇది వరకు కన్న కలలు , బద్దకంతో వాటిని విడిచిన క్షణాలు పదే పదే గుర్తొస్తుంటాయి.ప్రతి క్షణం అంతులేని కలలు. ఏవేవో చేసెయ్యాలని , ఏదో సాధించాలని  తపన. కొన్ని కలలు సాధించాలి అనిపిస్తుంది , కొన్ని సాధిస్తే బాగున్ను అనిపిస్తుంది , కొన్ని కలలు సాధించాటనికే బ్రతకాలి అనిపిస్తుంది    తపన ఉంటుంది కానీ , అది ఉండేది ఒకటో రెండో రోజులు , మహా ఐతే  ఒక వారం లేకుంటే ఒక నెల. తపన కనుమరుగైనప్పుడు చేసే పనికి కారణం లేని పరిస్థితి ఏర్పడుతుంది. ఇక కారణం లేని కార్యం అంటారా అది అస్సలు చెయ్యాలనే అనిపించదు. ఇది ఒక పెద్ద వ్యాధి అనిపిస్తుంది. ఔషధం కోసం చేసిన నా ప్రయత్నంలో ఒక కొత్త ప్రపంచాన్ని కనుగొన్నా. ప్రయాణం కొత్తది , దారిలో కలిగే  అనుభూతులు అనుభవాలు గురించి ముందు ముందు తెల్సుకుంటా తె

ఆలోచనలు

                ఒక క్షణకాలం ఆలోచన మొదలుపెడితే చాలు , ఏదో వింత ప్రపంచం లోనికి వెళిపోతుంటాం. మన ముందు జరిగే సంఘటనలు , శబ్దాలు ఏవి మనకు కనపడవు, వినపడవు. ఒక చీమ వెనకాల ఇంకో చీమ లాగ ఈ ఆలోచనలు ఒక దాని తరువాత ఇంకోటి అని వస్తూనే ఉంటాయి. వింత ఏంటి అంటే ఆ ఆలోచన ఈ ఆలోచన అని ఉండదు , అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి . కొన్ని ఏడిపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కొన్ని కవ్విస్తాయి. కొన్ని చక్కిలి గింతలు కూడా పెడతాయి అండోయ్. ఇలా ఒక రోజున చల్ల గాలి కోసం బయట తిరుగుతున్న నాకు తట్టిన ఒక చిన్న కవిత.    .  ప్రతి నిమిషం ఆలోచనలు  గతి మార్చే ఆవేశాలు  బతుకంతా  అవమానాలు  గడిచేనా అజ్ఞాతాలు  కరిచేలా అవహేళనలు  కలగలిపే అభిమానాలు  కలిగేనా అదృష్టాలు  జరిగేనా అభిషేకాలు  మనకెందుకు ఆచారాలు  మనసెరగదు అనివార్యాలు  అసలెందుకు ఆక్రోశాలు  అవసరమా ఆర్భాటాలు  మనుషులలో అవివేకాలు  మిగిలేలా అశేషాలు  తరుగునులే అపశకునాలు  జరగవులే అపచారాలు  మనసంతా ఆలాపనలు  . ప్రకృతితో ఆలింగనలు 

ఆత్మపరిశీలన

తాడు లేని గాలిపటం ఎవరికి దిక్సూచిరా  రంగులెన్ని ఉన్నాగాని రాలిపోదా మెల్లగా  చెట్టులోన చిక్కుకొని వానకి అది తడవగా  మట్టిలోన కలిసిపోదా నేల జారి చిన్నగా  హితబోధలు చేసి నువ్వు హితము మర్చిపోతుంటావ్  బతుకు కథలు బయటపెట్టి బ్రతకలేక చస్తుంటావ్  పరులకు ఇది సరికాదని పరిభాషలు మానుకో  కథలు మాని కదం తొక్కి నిన్ను నువ్వు తెలుసుకో                వేల రంగుల్లన్న గాలిపటం కూడా దారం తెగిపోయాయక , మెల్లగా నెల జారి మట్టిలో కలిసిపోతుంది . మన జీవితం మీద అవగాహన లేకుండా వేరే వాళ్ళకి నీతులు చెప్పే మన బుద్ధిని సరలించుకోవాలి అని చెప్పటానికి నా ఈ చిన్న పద్యం . అన్నిటికన్నా ముందు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని నా ఉద్దేశం. నా సొంత ఆత్మపరిశీలన ప్రారభంకై ఈ పద్యం సూచనగా నిలవాలని కోరుకుంటున్నాను.