తాడు లేని గాలిపటం ఎవరికి దిక్సూచిరా రంగులెన్ని ఉన్నాగాని రాలిపోదా మెల్లగా చెట్టులోన చిక్కుకొని వానకి అది తడవగా మట్టిలోన కలిసిపోదా నేల జారి చిన్నగా హితబోధలు చేసి నువ్వు హితము మర్చిపోతుంటావ్ బతుకు కథలు బయటపెట్టి బ్రతకలేక చస్తుంటావ్ పరులకు ఇది సరికాదని పరిభాషలు మానుకో కథలు మాని కదం తొక్కి నిన్ను నువ్వు తెలుసుకో వేల రంగుల్లన్న గాలిపటం కూడా దారం తెగిపోయాయక , మెల్లగా నెల జారి మట్టిలో కలిసిపోతుంది . మన జీవితం మీద అవగాహన లేకుండా వేరే వాళ్ళకి నీతులు చెప్పే మన బుద్ధిని సరలించుకోవాలి అని చెప్పటానికి నా ఈ చిన్న పద్యం . అన్నిటికన్నా ముందు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని నా ఉద్దేశం. నా సొంత ఆత్మపరిశీలన ప్రారభంకై ఈ పద్యం సూచనగా నిలవాలని కోరుకుంటున్నాను.
సంపూర్ణత మనిషికి సంతోషం మనసుకి