Skip to main content

Posts

Showing posts from May, 2018

ఆలోచనలు

                ఒక క్షణకాలం ఆలోచన మొదలుపెడితే చాలు , ఏదో వింత ప్రపంచం లోనికి వెళిపోతుంటాం. మన ముందు జరిగే సంఘటనలు , శబ్దాలు ఏవి మనకు కనపడవు, వినపడవు. ఒక చీమ వెనకాల ఇంకో చీమ లాగ ఈ ఆలోచనలు ఒక దాని తరువాత ఇంకోటి అని వస్తూనే ఉంటాయి. వింత ఏంటి అంటే ఆ ఆలోచన ఈ ఆలోచన అని ఉండదు , అన్ని రకాల ఆలోచనలు వస్తుంటాయి . కొన్ని ఏడిపిస్తాయి. కొన్ని నవ్విస్తాయి. కొన్ని కవ్విస్తాయి. కొన్ని చక్కిలి గింతలు కూడా పెడతాయి అండోయ్. ఇలా ఒక రోజున చల్ల గాలి కోసం బయట తిరుగుతున్న నాకు తట్టిన ఒక చిన్న కవిత.    .  ప్రతి నిమిషం ఆలోచనలు  గతి మార్చే ఆవేశాలు  బతుకంతా  అవమానాలు  గడిచేనా అజ్ఞాతాలు  కరిచేలా అవహేళనలు  కలగలిపే అభిమానాలు  కలిగేనా అదృష్టాలు  జరిగేనా అభిషేకాలు  మనకెందుకు ఆచారాలు  మనసెరగదు అనివార్యాలు  అసలెందుకు ఆక్రోశాలు  అవసరమా ఆర్భాటాలు  మనుషులలో అవివేకాలు  మిగిలేలా అశేషాలు  తరుగునులే అపశకునాలు  జరగవులే అపచారాలు  మనసంతా ఆలాపనలు  . ప్రకృతితో ఆలింగనలు