Skip to main content

ఆత్మపరిశీలన


తాడు లేని గాలిపటం ఎవరికి దిక్సూచిరా 
రంగులెన్ని ఉన్నాగాని రాలిపోదా మెల్లగా 
చెట్టులోన చిక్కుకొని వానకి అది తడవగా 
మట్టిలోన కలిసిపోదా నేల జారి చిన్నగా 

హితబోధలు చేసి నువ్వు హితము మర్చిపోతుంటావ్
 బతుకు కథలు బయటపెట్టి బ్రతకలేక చస్తుంటావ్ 
పరులకు ఇది సరికాదని పరిభాషలు మానుకో 
కథలు మాని కదం తొక్కి నిన్ను నువ్వు తెలుసుకో 


              వేల రంగుల్లన్న గాలిపటం కూడా దారం తెగిపోయాయక , మెల్లగా నెల జారి మట్టిలో కలిసిపోతుంది . మన జీవితం మీద అవగాహన లేకుండా వేరే వాళ్ళకి నీతులు చెప్పే మన బుద్ధిని సరలించుకోవాలి అని చెప్పటానికి నా ఈ చిన్న పద్యం . అన్నిటికన్నా ముందు మనం ఆత్మపరిశీలన చేసుకోవాలని నా ఉద్దేశం. నా సొంత ఆత్మపరిశీలన ప్రారభంకై ఈ పద్యం సూచనగా నిలవాలని కోరుకుంటున్నాను. 

Comments

  1. One of famous Buddha quotes "It is better to conquer yourself than to win a thousand battles" Self awareness is necessary for peaceful life.Look inside your heart and we can do amazing things with better understanding of self and others .Good Luck with your endeavour bro

    ReplyDelete
    Replies
    1. Thanks bro! Great words. Yeah all we need to do is to look into our heart and conquer inner peace.

      Delete
  2. is the second poem an inspiration from
    " Vatti maatalu katti pettoi. Gatti mel talapettavoi!"??

    Great work :)

    ReplyDelete
    Replies
    1. Thanks bro. Yes, nice observation. I really like the tempo of "vatti maatalu kattipettavoi.." so tried to maintain the same tempo

      Delete
  3. Great one!!!!
    Good Luck for your next works!!!

    ReplyDelete

Post a Comment